న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : హీరో మోటోకార్ప్.. మార్కెట్లోకి నూతన గ్లామర్ ఎక్స్ 125 మాడల్‌ను తీసుకొచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్‌తో తయారైన ఈ బైకు ధర న్యూఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1.01 లక్షలు. కాగా, 125 సీసీ విభాగంలో సింగిల్ చానల్ ఏబీఎస్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ రెండూ ఉన్న తొలి మోటార్‌సైకిల్ గ్లామర్ కావడం విశేషం. బ్లూటూత్ కనెక్విటివీతో నావిగేషన్‌తో ఇన్కమింగ్ కాల్స్‌ను అటెండ్ చేయడంతోపాటు ఎస్ఎంఎస్లను కూడా పంపుకోవచ్చును.
టైప్-సీ యూఎస్బీ చార్జింగ్, ఎల్ఈడీ లైటింగ్ ప్యాకేజ్, గ్లామర్ ఎక్స్‌లో పానిక్ బ్రేక్ అలర్డ్ కూడా ఉన్నది. ఇది అత్యవసర బ్రేకింగ్ సమయంలో వెనుకవున్న వాహనాలను హెచ్చరించడానికి ఎల్ఈడీ ఇండికేటర్లను వేగంగా ఫ్లాష్ చేయనున్నది. టీవీఎస్ రైడర్ 125, హోండా ఎస్పీ 125, బజాజ్ పల్సర్ 125లకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను తీసుకొచ్చింది.