Mangaluru | మంగళూరు రిఫైనరీలో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు.. ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
Mangaluru : కర్ణాటక, మంగళూరులోని ఒక రిఫైనరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళూరులో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వద్ద బుధవారం ఈ పేలుడు జరిగింది.
Mangaluru : కర్ణాటక, మంగళూరులోని ఒక రిఫైనరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళూరులో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వద్ద బుధవారం ఈ పేలుడు జరిగింది. మొత్తం ఎనిమిది మంది గాయపడగా.. వీరిలో ఒకరికి 35 శాతం కాలిన గాయాలైనట్లు ఎంఆర్‌పీఎల్ సంస్థ వెల్లడించింది.
జోకట్టే గ్రామ పరిధిలోని ఎంఆర్‌పీఎల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. పేలుడు ప్రభావానికి భారీగా పొగ వ్యాపించింది. కొన్ని కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. చాలా దూరం నుంచి ఈ పొగ కనిపించిందని స్తానికులు తెలిపారు. పేలుడు ప్రభావంతో రిఫైనరీ చుట్టుపక్కల బిల్డింగులు, నివాసాలు కూడా కంపించాయి. అంతేకాదు.. బాజ్పే పరిధిలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పేలుడు నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్టును తనిఖీ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, సహాయక బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సుల్ని మోహరించారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

