RTC Employees | చిక్కడపల్లి, ఆగస్టు 21 : ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ రిటైడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్‌భవన్ వద్ద శాంతియుత ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటైడ్ ఉద్యోగులు సంఘం ప్రతినిధిలు చంద్రారెడ్డి, పుట్ట లక్ష్మయ్య, రంగారావు, శ్రీనివాస్, కన్నయ్య, హామీద్, నసిరుద్దీన్, ప్రకాశ్ తదితరలు మాట్లాడారు. రిటైడ్ అయిన వారంందరికీ ఆర్పీఎస్ 2017 ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని అన్నారు. ఎస్ఆర్బీఎస్ లైఫ్ సర్టిఫికెట్‌ను పీఎఫ్ వలే ఆన్లైన్ అవకాశం కల్పించాలని అన్నారు. తార్నాక ఆసుపత్రిలో భార్యభకర్తలకు ఇద్దరికి సంవత్సరానికి బాడీ చెకప్ ఉచితంగా చేయాలని కోరారు. ఈపీఎస్‌లో తిరస్కరించిన అన్ని అప్లికేషన్లను వెంటనే సవరించి వారికి హయ్యర్ పెన్షన్ సాంక్షన్ చేయాలని, డీడీ చెల్లించిన వారందరికీ పీఎఫ్ హయ్యర్ పెన్షన్ ఆదె నెలలో సాంక్షన్ చేయాలని అన్నారు. అఖరి నెల జీతం ఏరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు. దూర ప్రాంతాలకు ప్రయణిచండానికి రిటైడ్ ఉద్యోగులకు రిజర్వేషన్ కౌంటర్లో ఆన్లైన్లో సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆయన సానుకూలంగా స్పదించారని వారు తెలిపారు.