రామంతాపూర్, జనవరి 16: రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిణ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పూజారుల సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒగిరాల రమేశ్, ప్రధాన కార్యదర్శి గంగు నర్సింహమూర్తి, కార్యదర్శి భాస్కరభట్ల రామశర్మ దేవాదాయ కమిషనర్ శ్రీధర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ధూపదీప నైవేద్యం కింద పూజారులకు రూ.20 వేలు పెంచాలని, జీత భత్యాలు, పెన్షన్ ఇ త్యాది ఇతర ఉద్యోగులకు ఇస్తున్నట్టుగా అర్చకులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవాదాయ భూములను ఇతర కార్యక్రమాలకు కేటాయించొద్దని పేర్కొన్నారు. ఏపీలోగా మాదిరిగా అనువంశిక అర్చకత్వాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెలిపారు. అర్చకులపై దేవాదాయ ఉద్యోగుల అజమాయిషీని రూపుమాపాలని పేర్కొన్నారు. టీటీడీ నుంచి తెలంగాణ వాటా రూ. 28 కోట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
డోర్నకల్, జనవరి 16 : డోర్నకల్ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ గన్‌మెన్ సెటిల్మెంట్ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగుగడ్డ తండా వద్ద డోర్నకల్ పోలీసులు ఈ నెల 9న 10 క్విం టాళ్ల నల్లబెల్లం పట్టుకున్నారు. మూడు బైకు లు, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దొరికిన బెల్లం, వ్యక్తులపై కేసు కాకుండా ఉండేందుకు ప్రభుత్వ విప్ గన్‌మన్ డోర్నకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు కా కుండా యత్నం చేశాడు. ఇందుకు సంబంధించి బాధితుల నుంచి ఫోన్ పే, నగదు రూపంలో డబ్బులు తీసుకున్నాడు. ఈ విష యం దినపత్రికల్లో ప్రచురితమవడంతో పో లీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చినా కూడా ఎలా కేసు పెడతారని గన్‌మెన్‌తో వాదనకు దిగాడు. ఇద్దరూ గొడవపడిన విషయం సో షల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తీసుకున్న డబ్బులను గన్‌మెన్ వాపస్ చేశా డు. గుర్తించిన జిల్లా పోలీస్ అధికారులు ప్రభుత్వ విప్ గన్‌మన్‌ను తొలగించి, హెడ్ క్వార్టర్ రిపోర్ట్ చేయమన్నట్టు తెలిసింది.