భైంసా, డిసెంబర్, 27 : పత్తి రైతు పంట పండుతున్నది. తెల్ల బంగారినికి కాసుల వర్షం కురుస్తున్నది. ఈ సారి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో తెలంగాణ రైతన్నకు మంచి ఆదాయం వస్తున్నది. ఈ మూడేళ్లలో ఎన్నుడూ లేనంత ధర పలుకుతుండగా, రైతులు ఖుషీగా ఉన్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం క్వింటాలు పత్తికి రూ. రికార్డు స్థాయిలో 8,650 ధర పలికింది. దీంతో అన్నదాతల ముఖాల్లో చిరు నవ్వులు వెల్లివిరిసాయి.