నిజామాబాద్ : నిజామాబాద్(Nizamabad) జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున నిజాం సాగర్ ప్రధాన కాలువ((Nizam Sagar Canal)) కట్ట తెగిపోవడానికి కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి కెనాల్ కట్టను ఆక్రమించి నిర్మాణం చేపట్టడం వల్లే కట్ట తెగిందని సంబంధిత ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో రవి కుమార్ తెలిపారు.
కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. మధ్యరాత్రి వేళ ఒక్కసారిగి నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.