హన్వాడ, అక్టోబర్ 6 : రానున్న ఎన్నికల్లో మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కే ఓటు వేస్తామని బుద్ధారం ప్రజలు ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని బుద్ధారం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్‌పై స్థానికులు సంతకాలు చేశారు. తమ ఓటు శ్రీనివాస్‌గౌడ్‌కే అంటూ తీర్మానం చేశారు. దాదాపుగా 500 మందికిపైగా సంతకాలు చేశారు.