హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : జాతీయ లోక్ అదాలత్ ఆదేశాల మేరకు ఈ నెల 8న తెలంగాణలోని అన్ని స్థాయి కోర్టుల్లో లోక్ అదాలత్‌లు జరుగుతాయి.
హైకోర్టు నుంచి సివిల్ కోర్టుల వరకు కక్షిదారులు (వాదప్రతివాదులు) ఉభయుల అంగీకారంతో తమ కేసుల్ని లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చునని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి గురువారం ఒక ప్రకటనలో పేరొన్నారు. వివరాలకు సంబంధిత కోర్టులో సంప్రదించవచ్చని చెప్పారు.