నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 30 : మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నే త అశోక్ ముదిరాజ్‌తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వికారాబాద్ జిల్లా పరిగి కాంగ్రెస్ నాయకుడు ముజామిల్ మాజీ ఎ మ్మెల్యే మహేశ్‌రెడ్డి, పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అ న్నాసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర్‌రెడ్డితోపాటు మరో పది మంది కా ర్యకర్తలు గులాబీకి గూటికి చేరారు. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నిట్టు రఘుపతిరావు సహా కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు దాదాపు వంద మంది బీఆర్ఎస్లో చేరగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ గులాబీ కండువాలుకప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు.
నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన నుడా మాజీ డైరెక్టర్, ఏఐబీఎస్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు నేనావత్ శ్రీహరినాయక్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో అసెంబ్లీ ఎ న్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి ఓడిపోయిన సరిత వర్గానికి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 200 మంది గద్వాలలో సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, నియోజకవర్గ నేత హనుమంతు నాయుడు, మున్సిపల్ మాజీ లచైర్మన్ బీఎస్ కేశవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.