హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదించింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ పరిస్థితులు మరో 5 రోజులపాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తుండటంతో రాబోయే ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. బుధవారం వివిధ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.