ఇక ఉద్యమమే శరణ్యం : మంత్రి జగదీష్‌రెడ్డి
Minister Jagadish Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

నల్లగొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడు సంవత్సరాల కాలంలో అన్ని రైతు వ్యతిరేక విధానాలను తీసుకుందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న మోదీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు చేశారని ఆయన దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ చేపట్టిన విధానాల వల్లనే తెలంగాణలో రైతుల ఆదాయం పెరిగింది సుస్పష్టం అని ఆయన చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరలతో తెలంగాణ రైతు జేబుకు కుడా చిల్లు పడిందన్నారు.
బీజేపీ వైఖరి దొంగే దొంగా..దొంగా అన్న చందంగా మారిందని మంత్రి ఎద్దేవాచేశారు. బాధ్యతాయుతమైన సీఎంగా రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తే సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ మౌనంగా ఉండి రాష్ట్ర నాయకులతో ఊరకుక్కల్లా మొరిగిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బీజేపీ ప్రభుత్వం ముంచుతుందని ఆయన ఆరోపించారు. నల్లడబ్బును తెస్తామన్న ప్రధాని ప్రస్తుతం పేద ప్రజల జేబులకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
బీజేపీ మోసపూరిత విధానాల పట్ల దేశ రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించే దాకా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

