ఆఖరి మజిలీ.. అనాథగా మిగిలి
కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లి చివరకు అనాథగా మిగిలింది. కాసులకు కక్కుర్తిపడి కడుపున పుట్టిన కూతుళ్లే.. మానవత్వం మరిచి తల్లి మృతదేహాన్ని దవాఖానలో వదిలేసి వెళ్లిపోయారు.
- దవాఖానలోనే మృతదేహాన్ని వదిలి వెళ్లిన కూతుళ్లు
- బ్యాంకులో ఉన్న డబ్బులు ఇవ్వలేదని తల్లికి దూరం
- కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఘటన
కామారెడ్డి, మే 7: కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లి చివరకు అనాథగా మిగిలింది. కాసులకు కక్కుర్తిపడి కడుపున పుట్టిన కూతుళ్లే.. మానవత్వం మరిచి తల్లి మృతదేహాన్ని దవాఖానలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేం ద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ (70) గత నెల 21న అనారోగ్యంతో ఏరి యా దవాఖానలో చేరింది. కిష్టవ్వకు ముగ్గు రు కూతుళ్లు. అందులో ఒకరు మృతి చెందా రు. మరో ఇద్దరు కూతుళ్లు ఎల్లవ్వ, పెంటవ్వలు దవాఖానలో ఉంటూ ఆమె బాగోగులు చూసుకున్నారు.
కిష్టవ్వ పేరు మీద బ్యాంకులో రూ.1.70 లక్షలు ఉన్నా యి. ఈ డబ్బులకు సంబంధించి కిష్టవ్వ బంధువు నామినీగా ఉన్నాడు. ఆ డబ్బులు తమకు ఇవ్వాలని ఇద్దరు కూతుళ్లు తల్లితో వాగ్వాదానికి దిగారు. కిష్టవ్వ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కూతుళ్లు ఆమెను దవాఖానలోనే వదిలి వెళ్లిపోయారు. దీంతో కిష్టవ్వకు దవాఖానలో సిబ్బంది ఇన్ని రోజులు సపర్యలు చేశారు. శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది. దవాఖాన సిబ్బంది కూతుళ్లకు సమాచారం ఇవ్వగా.. తమకు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పిస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. సిబ్బంది చేసేదేమీ లేక మృతదేహాన్ని అక్కడే భద్రపరిచారు. సోమవారం వరకు చూసి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

