Home
Telangana
The Moosi Project Is Nearing Its Full Capacity The Project Dee Chandrasekhar On Monday Switched On The Switch And Released The Water Downstream
అర అడుగు గేటు ఎత్తి మూసీ నీటి విడుదల
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ సోమవారం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది.
- 330 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు
కేతేపల్లి, జూన్ 5 : నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ సోమవారం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 3వ నెంబరు క్రస్ట్ గేటును అర అడుగు మేర ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
సోమవారం ఎగువ నుంచి 243.16 క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 644.60 (4.36 టీఎంసీలు) ఉన్నట్టు అధికారులు తెలిపారు. దిగువకు నీటిని విడుదల చేయడంతో నదిలోకి రైతులు, గొర్రెలు, మేకల కాపరులు, మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

