ప్రజలకు ఏ ఆపద రానివ్వం
ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వమని, బీఆర్ఎస్ ప్రజల ప్రభుత్వమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
- బాధితులకు అండగా రాష్ట్ర సర్కార్
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడి
- మున్నేరు ముంపు బాధితులకు చెక్కులు అందజేసిన మంత్రి
ఖమ్మం, సెప్టెంబర్ 10: ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వమని, బీఆర్ఎస్ ప్రజల ప్రభుత్వమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఆయన కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి 1,718 మంది ముంపు బాధితులకు ఒక్కొక్కరికి రూ.8,463 చొప్పున చెక్కులు అందజేసి మాట్లాడారు.
ముంపు బాధితులను ఆదుకోవడానికి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ రూ.50 లక్షలు సమకూర్చినట్టు చెప్పారు. ఆ సొమ్మును నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి ముంపు బాధితులకు అందజేస్తున్నట్టు తెలిపారు. వరదల సమయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణనష్టానికి తావు లేకుండా జాగ్రత్త వహించినట్టు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని గుర్తుచేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఆర్టీయూ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

