Delhi : ఢిల్లీలో కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఈ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎజెండాలో చేర్చాలని 12 అంశాలను ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టులను ఎజెండాలో పెట్టవద్దని తెలంగాణ కోరింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు 50 శాతం నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని అడిగింది. అయితే తెలంగాణ లేవనెత్తిన అంశాలపై ఏపీ అభ్యంతరం వ్యక్తంచేసింది.
కాగా ఏపీ సర్కారుతో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు జలద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. చంద్రబాబుతో దోస్తీకట్టి రేవంత్రెడ్డి తెలంగాణ అన్యాయం చేస్తున్నడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు.