హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు దివంగత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం ఎంసీఈఐ(యూ) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఎస్ఆర్ఎస్పీ రెండో దశ ప్రాజెక్టుకు మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి పేరు పెట్టడం సబబు కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ అభిప్రాయపడ్డారు. 2008లోనే భీమిరెడ్డి సంతాప సభలో నాటి మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి ఎస్ఆర్ఎస్పీ-2కు బీమిరెడ్డి పేరు పెడతామని చెప్పినట్టు గుర్తుచేశారు.