హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనరాకపోవడంతో తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఈ నెల 24న అన్ని జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఈనెల 19న తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీడీఎంఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నాచౌక్లో శాంతిదీక్షను నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, దశలవారీగా ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీంట్లో భాగంగా సోమవారం ప్రజావాణిలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని టీపీడీఎంఏ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, కార్యదర్శి యాద రామకృష్ణ కాలేజీల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.