మక్కలను తరలించకపోతే మార్కెట్ యార్డులోనే నిద్రిస్తా!
కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు.
- రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరిక
- జమ్మికుంట మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీ
హుజూరాబాద్, మే 13 : కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మారెట్లోని మార్ఫెడ్ మకల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో నేరుగా మాట్లాడారు. మారెట్ యార్డులో వేలాది మకల బస్తాలు పేరుకుపోవడం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మారెట్లో సుమారు 40 వేల బస్తాలు పేరుకుపోయి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరిక చేశారు. మకలను తరలించేందుకు రైతుల వద్ద కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హమాలీల కొరతతో లోడింగ్, అన్ లోడింగ్ పనులు పూర్తిగా దెబ్బతిన్నాయని మారెట్ సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సమస్య పరిషారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

