హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి (ఎంబీబీఎస్) ఏకోనవింశతి (19వ) వార్షికోత్సవం జూలై 2 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్టు ఆ సమితి కార్యవర్గం తెలిపింది. హైదరాబాద్ మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించే వార్షికోత్సవంలో గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, అరుణ, రుద్రసహిత శతచండీయాగం నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.
శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి మహాస్వామి ఆశీస్సులతో, మాధవానంద సరస్వతీ స్వామి దివ్య అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమితి అధ్యక్షుడు లక్ష్మణప్రసాద్శర్మ, ప్రధాన కార్యదర్శి రామకృష్ణశర్మ, కోశాధికారి మహాదేవశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.