హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో తూర్పు దిశ నుంచి చలి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో 17 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. అత్యంత కనిష్ఠంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 5.9 డిగ్రీలుగా నమోదయ్యాయని పేర్కొన్నది.