Lok Sabha Elections | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల్లో పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 66.07 శాతం ఓటు వేయగా, మహిళలు 65.29 శాతం ఓటు వేశారు. పురుషులు 1,65,13,014 ఉండగా 1,09,09,963 మంది, మహిళలు 1,67,00,574 ఓటర్లుగా ఉండగా 1,09,03,227 ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటర్లుగా మహిళలే అధికంగా ఉన్నా ఓట్లు మాత్రం తక్కువగా వేశారు. రాష్ట్రంలో మొత్తం 65.67 శాతం ఓటర్లు ఓటు వేశారు. ట్రాన్స్జెండర్లు 30.25 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనగిరి, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో పురుషులు, మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ మంది ఓటేశారు.