మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు టికెట్లకోసం సిగపట్లు పడుతున్నారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డికి కూడా టికెట్ దక్కదనే ప్రచారం జోరందుకున్నది.
కొల్లాపూర్‌లో జూపల్లి చేరికతో జగదీశ్వర్‌రావుకు టికెట్ డౌట్లో పడింది. మహబూబ్‌నగర్ స్థానంలో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారంతో స్థానిక కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.