MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే సహించేది లేదు : బీసీ సంఘాల నాయకులు
MLC Kavitha | మ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను బీసీ సంఘాల నాయకులు(BC unions) తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyothi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను బీసీ సంఘాల నాయకులు(BC unions) తీవ్రంగా ఖండించారు. విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అని చెప్పకుండా విమర్శలు చేయడం తగదన్నారు. ఇలానే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
యునైటెడ్ ఫ్రాంట్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు గురువారం సోమజి గూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ పూలే ఫ్రెంట్ రాష్ట్ర నాయకుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ..మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు కోసంతో పాటు బీసీల హక్కల సాధనకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు.
ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఉద్యమిస్తే అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ప్రస్తావించారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఈ నెల రెండో వారంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డా. ఎల్చల దత్తాత్రేయ,బోల్ల శివ శంకర్ పద్మశాలి సంఘం జాతీయ నాయకులు, గౌతమ్ ప్రసాద్, కోలా శ్రీనివాస్ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుci, ఆలకుంట్ల హరి, యూపీఎఫ్ నగర అధ్యక్షుడు, దోగుంట్ల నరేష్, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ జేఏసీ నాయకులు మన అశోక్ యాదవ్, చింత మహేష్ కుమార్, అర్జున్ అనిల్ ప్రజాపతి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

