కొందుర్గు, జనవరి 27: రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనుల ను వెంటనే ప్రారంభించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రజా సంఘాల నాయకు లు టీజీ శ్రీనివాస్, అర్జునప్ప, రవీంద్రనాథ్, నర్సింలు, రామచందర్ ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చెగిరెడ్డి ఘనపూర్ ఉమ్మడి గ్రా మ పంచాయతీల్లో పర్యటించి వారు మాట్లాడారు. గిరిజన తండాలు దయనీయ స్థితిలో ఉన్నాయని, అనేక కు టుంబాలు మహారాష్ట్ర, పుణె, ముంబై వలస వెళ్లాయని తెలిపారు.
వలసలు ఆగాలంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చే యాలని డిమాండ్ చేశారు. ఇక్కడ భూములు ఉన్నా సాగుచేసేందుకు నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారని, అందుకే ఇతర రాష్ర్టాలకు వలసపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్ల యినా రిజర్వాయర్ గురించి ఎందు కు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించా రు. పనులు ప్రారంభించకపోతే ఉద్య మం చేపడుతామని హెచ్చరించారు.