నార్నూర్ : పుష్య మాసాన్ని పుష్య పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) లో తోడసం వంశీయులు మహాపూజలతో శ్రీ శ్రీ శ్రీ ఖాందేవ్ జాతర ( Khandev Jatara ) అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం దైవ సన్నిధిలో తైలం సేవించే మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు నలుమూల ప్రాంతాల నుంచి తోడసం వంశస్థులు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఆచారం ప్రకారం ఖాండ గ్రామానికి చెందిన తోడసం దుర్గుబాయి-దుర్గు దంపతుల కుమార్తె సుర్పం సాక్రుబాయి 2.5 కిలోల నువ్వుల నూనె తాగింది .
ఈ జాతర 15 రోజులపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు నాగరావ్, ఆలయ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, సర్పంచ్ బానోత్ కావేరి, రాయి సెంటర్ జిల్లా సార్ మేడి మెస్రం దుర్గుపటేల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తోడసం పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.