కల్వకుర్తి, జనవరి 24 : నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగకు రికార్డు ధర పలికింది. శనివారం రైతులు 306 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి తీసుకురాగా.. రహస్య టెండర్ విధానంతో వ్యాపారులు ధరలు నిర్ణయించి కొనుగోలు చేశారు.
గరిష్ఠంగా రూ.11,029, కనిష్ఠంగా రూ.8,689, మోడల్ ధర రూ.11,009 నిర్ణయించి కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున ధరలు వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు.