రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): “కేంద్ర జల విద్యుత్తు పరిశోధన సంస్థ (ఎన్‌డీఎస్‌సీఎల్) రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలి. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయని పక్షంలో కేసీఆర్ ఆదేశాల తో మరో ఉద్యమం చేసైనా రేవంత్‌రెడ్డి మెడ లు వంచుతాం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం రాజన్న సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మేడిగ డ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఎక్స్లెంట్ గా ఉన్నాయని ఎన్‌డీఎస్‌సీఎల్ రిపోర్టు ఇవ్వ డం శుభ సూచకమని, ఇప్పటికైనా రేవంత్, ఉత్తమ్‌కు జ్ఞానోదయం కలుగాలని అకాంక్షించారు.
కేటీఆర్ ముందుచూపుతో రెండు నెల ల క్రితమే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి, ప్రభుత్వానికి సూచనలు, సలహా లు అందించారని గుర్తుచేశారు. నీటిని ఎత్తిపోసే విషయమై హరీశ్‌రావు డీటెయిల్‌గా పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చి.. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించి అన్నారం, సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోయవచ్చని సూచించారని చెప్పారు. గోదావరిలో ప్రాణహిత జలాలు వృథాగా దిగువకు పోతూ పోలవరానికి చేరుతున్నాయని చెప్పారు. సాగునీటి సమస్య, హైదరాబాద్ తాగునీటి సమస్య తీర్చేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రూ.100 కోట్లు పెట్టి కాఫర్ డ్యామ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు పాల్గొన్నారు.