BRS | ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ జురాస్ట్రియల్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సనత్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 10 వేలకు పైగా గ్రాడ్యుయేట్ ఓట్లు ఉంటాయి. ఒక్క గ్రాడ్యుయేట్‌ను కూడా మర్చిపోకుండా ఓటరుగా నమోదు చేయించాలన్నారు. రెండు గ్రాడ్యుయేట్, ఖైరతాబాద్ ఉప ఎన్నికల పని ఉంటది. 30 రోజుల కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు నమోదు కార్యక్రమం చేయించాలన్నారు. రెండు గ్రాడ్యుయేట్ లపై మనం ఫోకస్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
హామీలు, సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ రెండు ఎమ్మెల్సీలు ఓసీలకు ఇచ్చారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో అర్హులు లేరా? అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రిని ఏమైనా అడుగుతాం అంటే బూతులతో రెచ్చిపోతారు .
అసెంబ్లీలో హరీశ్ రావు ఆడుకుంటారు అని సభ ను నడుపవద్దు అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.