హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెషన్ ఇచ్చే అంశాన్ని అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం వారికి వైద్యం చేసే అర్హత లేదని పేర్కొన్నది. వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా ప్రజలకు సరైన వైద్యసేవలు అందవని ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో ఎంబీబీఎస్ల సంఖ్య పెరిగిందని, వారిని సద్వినియోగం చేసుకొని గ్రామీణ వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని సూచించింది.