హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా పాటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ కార్యాలయంలో జాక్టో సమావేశమైంది.
సెప్టెంబర్ 1న బడుల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి, సాయంత్రం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలకు జాక్టో చైర్మన్ జీ సదానందం గౌడ్, సెక్రటరీ జనరల్ మట్టపల్లి రాధాకృష్ణ, కోశాధికారి కే కృష్ణుడు సూచించారు. పీఆర్సీ కమిటీ వేయాలని, ఐఆర్‌ను ప్రకటించాలని, కోర్టు కేసులను పరిష్కరించి వెంటనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు
చేపట్టాలని వారు కోరారు.