హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్‌బోర్డు పొడిగించింది. జూలై 31 వరకు ప్రవేశాలకు అవకాశం ఇచ్చింది. మొదటి విడత అడ్మిషన్ల గడువు మంగళవారంతో ముగియడం, ఇటీవలే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకావడంతో తాజాగా అడ్మిషన్ల గడువును పొడిగించారు. సీబీఎస్ఈ సెకండ్ బోర్డు పదోతరగతి ఫలితాలు ఇంకా విడుదలకాకపోవడం కూడా గడువు పొడిగింపునకు కారణం.
ఉపాధ్యాయ శిక్షణల్లోని లోపాలు సవరించాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యుడు పునుగోటి అంజన్‌రావు కోరారు. జూలైలో బీఈడీ, డీఎడ్ కాలేజీల్లోని అధ్యాపకుల చేత టీచర్లకు శిక్షణ ఇప్పించాలని కోరుతూ మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు వినతిపత్రం సమర్పించారు.