హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కారు జూనియర్ కాలేజీల మరమ్మతులకు ఇంటర్ విద్యాశాఖ నిధులు మంజూరుచేసింది. 326 కాలేజీలకుగాను రూ.56.16కోట్లు ఇచ్చింది.
ఈ నిధులతో కాలేజీ భవనాలకు రంగులు వేయడం, తాగునీటి వసతి కల్పించడం, ఎలక్ట్రిఫికేషన్, సివిల్, శానిటరీ పనులు, టాయిలెట్ల మరమ్మతులు, నల్లాల బిగింపు చేపట్టాలని సూచించింది.