తుమకూరు, జూలై 17: బావిలో పడిన మూడేండ్ల తన సోదరిని ఓ బాలిక కాపాడిన ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేంద్ర, రాజ్‌కుమారి దంపతులు తుమకూరులో వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారి చిన్న కుమార్తె రషి ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది.
గమనించిన ఎనిమిదేండ్ల శాలిని లైఫ్ జాకెట్ సాయంతో బావిలో దూకి సోదరిని మెట్ల వద్దకు చేర్చింది. మెట్ల వద్ద ఉన్న ఇద్దరిని పెయింటర్ అన్నప్ప బయటకు తీసుకొచ్చారు. ఫాంహౌస్ యజమాని ఈ విషయాలను ఫేస్బుక్లో వెల్లడించారు.