సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 18 : ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లుపల్లికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేండ్ల క్రితం ఇంటి కోసం ఫైనాన్స్ కం పెనీలో లోన్ తీసుకున్నాడు. తర్వాత రెండు ఇఎంఐలు కట్టకపోవడంతో వారి వేధింపులు అధికమయ్యాయి. ఈక్రమంలో పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.