హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఇన్‌సర్వీస్ టీచర్లకు నిర్వహించే టెట్ పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో కాకుండా మ్యానువల్‌గా నిర్వహించాలని, టెట్ అర్హత మార్కులను తగ్గించాలని కోరుతూ శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేసింది.