హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మలాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ- గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.