హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్, ఆర్డీవోలకు ఆ అధికారం లేదని చెప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్పేట్ గ్రామంలోని సర్వే నం.122లోని రెం డెకరాల భూమికి హకులను ధ్రువీకరిస్తూ స్వాధీన పత్రాన్ని జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నార్లకొండ మల్లయ్య ఇతరులు దాఖ లు చేసిన పిటిషన్ను జస్టిస్ సీవీ భాసర్రెడ్డి సోమవారం విచారించారు. 1985లో సాదాబైనామా ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెలికాని వెంకటయాదవ్ తెలిపారు.
క్రమబద్ధీకరణ దరఖాస్తు పెండింగ్లో ఉండగా భూమిని విక్రయించిన వ్యక్తి, అతని కొడుకు వెంకటరెడ్డి, అధికారుల సాయంతో భూమిని ఇతరులకు అమ్మేసి హకు పత్రాన్ని పొందారని వి వరించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ పంపిన రిపోర్టు ఆధారంగా కలెక్టర్ ప్రతివాదులకు భూస్వాధీన పత్రాన్ని జారీచేశారని చె ప్పారు. సివిల్ కోర్టు నిర్వహించాల్సిన విధులను అధికారులు నిర్వహించడానికి వీల్లేదని గుర్తుచేశారు. దీనిపై కింది కోర్టు యథాతథ స్థి తిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ప్రతివాదులకు నోటీసు లు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.