హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగా ణ): ట్రాన్స్జెండర్లకు ఆసరా పింఛన్లు అందజేయడం, రిజర్వేషన్లు కల్పించడంలో జరిగిన జాప్యంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ నపుంసకుల చ ట్టం 1329 ఫస్లీ రాజ్యాంగానికి విరుద్ధమని, లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులకు ఆసరా పింఛన్లను విస్తరించాలని, విద్యాసంస్థలు, ప్రభు త్వ నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని 2023లో ప్రజాప్రయోజన వ్యా జ్యం దాఖలవడంతో టాన్స్జెండర్ల కోసం సంక్షే మ బోర్డును ఏర్పాటు చేయాలని గతంలో హై కోర్టు ఆదేశించింది.
రెండేండ్ల క్రితం వెలువడిన ఈ ఆదేశాలు ఇంకా అమలు కాలేదంటూ హైదరాబాద్కు చెందిన వైజయంతీ వసంత మొగిలి కోర్టు ధికరణ పిటిషన్ వేయగామంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.