హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో పేరెంట్, టీచర్ అసోసియేషన్ (పీటీఏ) ఏర్పాటుకు తీసుకున్న చర్యలను వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యాచట్టం ప్రకారం ప్రతి పాఠశాలలోనూ పీటీఏ ఏర్పాటుచేయాలనే నిబంధన అమలు కావడం లేదని మల్లికార్జున్ పాటిల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.