హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఫీల్డ్మెన్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావుకు హైకోర్టు ఊరట కల్పించింది. వారికి విధించిన జైలుశిక్ష, జరిమానాను నిలిపివేసింది.
తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆ తేదీలోగా న్యాయస్థానంలో లొంగిపోవాలని కృష్ణబాబు, ద్వారకా తిరుమలరావును ఆదేశించింది.