హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పత్రికల్లో పనిచేసేవారికి అక్రెడిటేషన్ కార్డుల జారీలో పెద్ద పత్రికలు, చిన్న పత్రికల విభజనను హైకోర్టు తప్పుపట్టింది. చిన్న పత్రికలను ఏ, బీ, సీ, డీలుగా విభజించడం చెల్లదని తీర్పిచ్చింది. జీవో 230లో షెడ్యూల్-ఇలోని నిబంధన చెల్లదని పేరొంది.
రెండు నెలల్లోగా చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. అక్రెడిటేషన్ కార్డుల జారీకి 2016లో ఇచ్చిన జీవోలోని నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని మహబూబ్‌నగర్‌కు చెందిన టీ కృష్ణ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.