హైదరాబాద్, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ): పల్లెల్లో ఎడ్లబండ్లు వెళ్లేదారి ప్రజారహదారే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి దారులను ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని తెలిపింది. రహదారులు, నడకదారులు, నదులు, చెరువులు, వంతెనలు ప్రభుత్వ ఆస్తులేనని ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) ల్యాండ్ రెవెన్యూ యాక్ట్‌లోని సెక్షన్ 24 పేరొంటున్నదని గుర్తుచేసింది. సరిహద్దుల చట్టంలోని నిబంధనల ప్రకారం పాత రికార్డుల్లో బండ్ల దారి ఉంటే, పది అడుగులు లేదా 3.04 మీటర్ల దారి వదలాల్సిందేనని చెప్పింది.
బండ్ల దారిని ఆక్రమించారని సంగారెడ్డి జిల్లా పులల్ మండలం కోడూరు గ్రామస్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ టీ మాధవీదేవి విచారించారు. పాత్ అనే పదాన్ని దారి అని పేరొనవచ్చని, బండ్ల దారి వెళ్లే భూమి ఎవరిదైతే వారికి 10 ఫీట్ల భూమి ఇవ్వాలని, బండ్లదారి ఆక్రమణకు గురైతే తొలగించే అధికారం కార్యదర్శికి ఉండదని, ఆ బాధ్యత రెవెన్యూ అధికారులదని ఉత్తర్వుల్లో పేరొన్నారు.