హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): చెక్ బౌన్స్ కేసులో కింది కోర్టు జారీచేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) అమల్లో జాప్యం జరుగడంపై దర్యాప్తు నిర్వహించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది.
హైదరాబాద్ మనోరంజన్ కాంప్లెక్స్జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏప్రిల్ 17న జారీచేసిన ఎన్బీడబ్ల్యూను పోలీసులు సకాలంలో అమలు చేయలేదని ధూల్‌పేటకు చెందిన ధనుంజయ్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. జూలై 7న వారెంట్‌ను అమలు చేసినట్టు కోర్టుకు తెలిపారు.