హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : ఈహెచ్ఎస్ ట్రస్టు లేదు.. మార్గదర్శకాల్లేవు.. వేతన కోతలా..? అంటూ ఉద్యోగ వర్గం ప్రశ్నించడంతో సర్కార్ ఉలిక్కిపడ్డది. ఆగమేఘాల మీద 1.5 శాతం కోత విధించడం బూమరాంగ్ కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈహెచ్ఎస్ ట్రస్టును సోమవారం ప్రకటించనున్నది.
ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులను ట్రస్టు సభ్యులుగా ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని సీఈవోగా నియమించే అవకాశమున్నది. ఈ పథకం అమలుకు చందా సేకరణ ప్రారంభమైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థికశాఖలో అప్లోడ్ చేసిన వారి వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్కారులు అందజేయనున్నారు.