హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): స్త్రీ నిధి సహకార సమాఖ్య ఎండీ విద్యాసాగర్రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం కమిటీ వేసింది. ఐఏఎస్ అనితారామచంద్రన్, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి చంద్రకళ, ఐటీ శాఖ ఎంజీఎం శ్రీనివాస్‌ను సభ్యులుగా చేర్చింది.
స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు.