హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలోని మరో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి (పీఐసీ) కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలు ఆరు నెలలపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు పనిచేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్ జిల్లాలోని దేవంపల్లి, గట్టుదుద్దెనపల్లి యాదాద్రి జిల్లాలోని భువనగిరి, చందుపట్ల బీబీనగర్, వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి, వికారాబాద్ జిల్లాలోని పూడూరు పీఏసీఎస్‌లకు ఈ కమిటీలను నియమించినట్టు వెల్లడించారు.