హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మేడే-2023 వేడుకలను మే 1న ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి సీహెచ్ మల్లారెడ్డి హాజరుకానున్నారు.
కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొంటారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై, మేడే వేడుకలను జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.