మైనారిటీల పక్షమని గప్పాలు పలికే కాంగ్రెస్.. వారిని ఓటు బ్యాంకుగా చూసిందే కానీ, నిరుపేద ముస్లింల కష్టాలు తీర్చే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. తెలంగాణ సాధన తర్వాతే రాష్ట్రంలోని మైనారిటీలకు మెజారిటీ సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి. ముస్లిం పేద కుటుంబంలో జన్మించిన ఆడపిల్లల వివాహం కోసం ప్రభుత్వం ‘షాదీ ముబారక్’ పేరిట 2014లో పథకం ప్రారంభించింది. తొలుత యాభై వేలుగా ఉన్న సాయం మొత్తాన్ని అనతి కాలంలోనే రూ.1,00,116కు పెంచింది. ఇప్పటి వరకు 2,68,535 మంది ఆడబిడ్డల పెండ్లికి రూ.2,688 కోట్లు ఇనాం అందించింది.
మాది అంకుశాపూర్. మా నాన్న నా చిన్నప్పుడే సచ్చిపోయిండు. అమ్మ బీమారితోనే ఉంటుండే. మా అన్నలు అప్పులు చేసి ఆమెను దవాఖానల చూపిస్తుండే. వాళ్లే తిప్పలు పడి ఎట్లనో నా పెండ్లి చేసిన్రు. మా అత్తగారోళ్లూ పేదోళ్లే. మా పెండ్లికి ముందే మా మామయ్య కాలం చేసిండు. మా ఆయన, మరిది టీ, అరటిపండ్లు అమ్మి ఇల్లు నడిపిస్తరు. నాకు పెండ్లయిన కొత్తల సీఎం సాబ్ షాదీ ముబారక్ పెట్టిండు. దస్తర్కు పోయి దరఖాస్తు పెట్టుకుంటే నాకు లక్ష రూపాయలు అచ్చినయ్.
ఆ పైసలు బ్యాంకుల పెట్టుకున్నం. కొన్నొద్దులకు నాకు అబార్షన్ అయింది. బతుకుడే కష్టమన్నరు డాక్టర్లు. గా టైమ్‌ల షాదీ ముబారక్ పైసలే ఆదుకున్నయ్. మా ఆడబిడ్డ పెండ్లికి కూడా షాదీ ముబారక్ పైసలు అచ్చినయ్. ఆ పైసలతోనే కర్సులన్నీ ఎల్లినయ్. మా పేదింటి బిడ్డ పెండ్లికి మేనమామలా ఆదుకున్నడు ముఖ్యమంత్రి. బిడ్డ పుడితే తండ్రిలెక్క కేసీఆర్ కిట్ ఇస్తున్నడు. నాకు, మా ఆయనకు ఇద్దరికీ నాన్న లేడు. ఏ అండా లేదు. మాకు అన్నీ ముఖ్యమంత్రే! మా కుటుంబాన్ని నిలవెట్టిన కేసీఆర్ సాబ్‌కు మా ముబారక్.
– అజీజా సుల్తానా, గృహిణి, రామగుండం, పెద్దపల్లి జిల్లా