హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా ప్రైవేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు బ్రోకర్లకు 2-3 శాతం కమీషన్ ఇచ్చేందుకు కూడా నిర్ణయించిందని విమర్శించారు.
ఆస్తులు అమ్మడం, అప్పులు చేయడం నిరంతర ప్రక్రియ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నిధుల సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే భూములను అమ్ముతామని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని కాంగ్రెస్ పాలకులు ఏ లెక్కన చెప్తున్నారో వివరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాను ఏ లెక్కలు చూసినా, ఏ బడ్జెట్ పుస్తకం వెతికినా రూ.7 లక్షల అప్పు లెక్క తేలడం లేదని పేర్కొన్నారు.