Indiramma Indlu | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు తమ ఇండ్ల స్టేటస్‌ను మొబైల్లో చూసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు ఏ స్టేజీలో ఉంది.. ఇంటి కోసం సర్వే నిర్వహించారా? ఇల్లు మంజూరైందా.. లేదా?
వంటి అంశాలను, మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా? ఏ కారణంతో మంజూరు కాలేదో వివరాలను http://indira mmaindlu.telangana.gov.in వెబ్సైట్ గ్రీవెన్స్ స్టేటస్ సెర్చ్‌లోకి తెలుసుకోవచ్చని సూచించింది. ఆధార్, మొబైల్, రేషన్‌కార్డు నంబర్‌తో వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.